
హైదరాబాద్, వెలుగు: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మన్నె చంద్రయ్య , అసోసియేట్ ప్రెసిడెంట్ గా రావుల కార్ వెంకటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో పీఆర్టీయూటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఇటీవల పలువురు సంఘం నుంచి వెళ్లిపోవడంతో, వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకున్నట్టు పీఆర్టీయూటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, ఫైనాన్స్ సెక్రటరీ పులి దేవేందర్ తెలిపారు. అనంతరం మాజీ టీచర్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.