టీచర్ల సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలి : టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్

టీచర్ల సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలి : టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, విద్యారం గ సమస్యల పరిష్కారానికి సీఎం నేరుగా జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ కోరారు. ఆదివారం హైదరాబాద్​లో టీఆర్టీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా రమేశ్​ మాట్లాడుతూ.. ఉద్యోగ, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్-కమిటీ, ఐఏఎస్ ల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, ఎలాంటి పురోగతి లేదన్నారు. అందుకే సీఎం స్వయంగా చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. జేఏసీ తరఫున ఇచ్చిన 57 డిమాండ్లలో ఆర్థిక అంశాలకు సంబంధించినవి ఇప్పటికీ పరిష్కారం కాలేదనిన్నారు. సమావేశంలోసంఘం నేతలు మారెడ్డి అంజిరెడ్డి,  అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.