96 లక్షల మంది విద్యార్థులకు నట్టల మందు 

96 లక్షల మంది విద్యార్థులకు నట్టల మందు 
  • నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పంపిణీ

హైదరాబాద్, వెలుగు: సోమవారం నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను (అల్బెండజోల్) ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ సెంటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో 1 నుంచి 19 ఏండ్ల లోపు 96 లక్షల మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా మాత్రలను  అందజేయనుంది. మాత్రలు తీసుకొని విద్యార్థుల కోసం ఆగస్టు 18న మరోసారి మాపప్ డే నిర్వహించి  మాత్రలను అందించనున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని  సోమవారం షేక్ పేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మంత్రలు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ప్రారంభించనున్నారు. చిన్నారుల్లో నులిపురుగులను నివారించి రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రతి ఏడాది నేషనల్ డీ వార్మింగ్ డే ను పురస్కరించుకొని అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు.