
మంచిర్యాల జిల్లా : నిరుద్యోగ యువత అభ్యున్నతి కోసమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ చేపట్టిందని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ పథకం కింద అర్హులైన యువతకు రూ.50 వేల నుండి 4 లక్షల వరకు రుణాల మంజూరు చేస్తామని చెప్పారు. జూన్ 2 న రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. సిబిల్ స్కోర్ ఆధారంగానే నిరుద్యోగ యువతకు రుణాల మంజూరు చేస్తారని అన్నారు.
మందమర్రి బి1 కార్యాలయంలో మండల కార్యకర్తల తో సమావేశం నిర్వహించారు. మందమర్రి మున్సిపాలిటీ కి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే వివేక్.
Also Read : మానాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి?
సింగరేణి సంస్థ మనుగడ రానున్న కాలంలో ప్రశ్నార్థకంగా మారనుందని ఈ సందర్భంగా అన్నారు. సింగరేణి సంస్థకు అలాట్మెంట్ చేసిన బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం పన్ను రూపంలో సింగరేణి సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థ నేరుగా వేలంపాటలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకంటే కేంద్ర ప్రభుత్వానికి 14 శాతం పన్ను చెల్లించనవసరం లేదని అన్నారు.
సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని కోరారు. సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు.. కొత్త గనులు తీసుకువచ్చేందుకు అన్ని పార్టీల నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.