అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఈ మూవీ ట్రైలర్ చూస్తే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ ఊరి కథను ఇందులో చూపించబోతున్నారు. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇందులోని క్లైమాక్స్ తెలుసుకుని షాక్ అయ్యా.
ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతారు’ అని అన్నాడు. కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు తరుణ్ భాస్కర్, సాయి మార్తాండ్ సినిమా సక్సెస్ సాధించాలని కోరారు. ఇదొక మట్టి కథ అని, 15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమ కథను సినిమా రూపంలో చూపిస్తున్నామని దర్శకుడు సాయిలు చెప్పాడు. ఎంతో నిజాయితీగా ఈ చిత్రంలో నటించామని హీరో హీరోయిన్ అన్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ. 99, మల్టీప్లెక్స్‌లలో రూ.105 కి టికెట్ రేట్స్ తగ్గించామని నిర్మాతలు తెలియజేశారు. కంటెంట్‌పై నమ్మకంతోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత వంశీ నందిపాటి అన్నారు. నటులు శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి, సింగర్ అనురాగ్ కులకర్ణి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.
