రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ రిలీజ్

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది.  15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు ఈసీ షెడ్యూల్‌ రిలీజ్ చేసింది.  ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా..  ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది.  నామినేషన్ దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ, ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20.  తెలంగాణలో మూడు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  

ఏప్రిల్‌ నెలఖారుకు 56 మంది రాజ్యసభ సభ్యుల  పదవీకాలం ముగియనుంది. తెలుగురాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలు ఖాళీ అవుతుండగా .... తెలంగాణాలో 3 స్థానాలకు.. ఆంధ్రప్రదేశ్​ లో 3 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి.  అత్యధికంగా... ఉత్తరప్రదేశ్‌ లో 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణ నుంచి రిటైర్ అవుతున్న రాజ్యసభ ఎంపీలు...

  • 1.  వద్దిరాజు రవిచంద్ర  2.  బడుగుల లింగయ్య యాదవ్  3. జోగినపల్లీ సంతోష్.

ఆంధ్రప్రదేశ్ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీలు... 

  • 1.  సీఎం రమేష్  2.  కనకమేడల రవీంద్ర కుమార్  3. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్​ వివరాలు

  • నోటిఫికేషన్​ విడుదల  : ఫిబ్రవరి 8
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేది:  ఫిబ్రవరి 15 
  • పోలింగ్​ తేది : ఫిబ్రవరి 27
  • పోలింగ్​ సమయం : ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • కౌంటింగ్​:  ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటల నుంచి