రాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్..మళ్లీ వాయిదా

రాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్..మళ్లీ వాయిదా

రాజ్యసభలోనూ  సేమ్ సీన్  రిపీటైంది. ఢిల్లీ  అల్లర్లపై  చర్చకు విపక్షాలు నోటీసులు  ఇచ్చాయి. సభ ప్రారంభం  కాగానే  చైర్మన్ వెంకయ్యనాయుడు  సంతాప  తీర్మానం సభ ముందు ఉంచారు.  ఫిబ్రవరి 26న  మృతి చెందిన రాజ్యసభ  ఎంపీ, అస్సాం  గణపరిషత్ నేత  బద్రేశ్వర్ మృతికి  సానుభూతి తెలుపుతూ.. రాజ్యసభ  2 నిమిషాలు మౌనం  పాటించింది. అధికార భాషపై కమిటీ ఎన్నికకు  సంబంధించి కేంద్ర హోంశాఖ  సహాయమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన చేశారు.  కేంద్రపాలిత  ప్రాంతం లక్షద్వీప్ లో  పార్లమెంటరీ స్టాండింగ్  కమిటీ సూచనలతో  తీసుకుంటున్న చర్యలపై హోంశాఖ సహాయమంత్రి  కిషన్ రెడ్డి   స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విపక్షాలు నినాదాలు  మొదలుపెట్టాయి.

ప్రతిపక్షాలు  ఇచ్చిన నోటీసులపై  సభా నాయకులు , ప్రతిపక్షాలపై చర్చించాల్సి ఉందని..  మార్చి 11  తర్వాత చర్చిద్దామని  వెంకయ్యనాయుడు చెప్పారు. రూల్స్,  ప్రొసీజర్లను   పరిశీలించి చర్చించాల్సి  ఉందని  చైర్మన్ చెప్పారు. కరోనా వైరస్ పై   చర్చించాల్సి ఉందని  చెప్పినా.. విపక్ష సభ్యులు వినలేదు. గందరగోళం మధ్య  రాజ్యసభను గురువారం 11 గంటలకు  వాయిదా వేశారు వెంకయ్యనాయుడు.