
న్యూఢిల్లీ: గుజరాత్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ రాకేశ్ ఆస్థానాను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1984 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన రాకేశ్ ఆస్థానా.. ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్)గా పని చేస్తున్నారు. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అదనపు బాధ్యతలను కూడా ఆస్థానానే నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు 2,280 కి.మీ.ల మేర పాకిస్థాన్‌తో ఉన్న పొడవైన బార్డర్‌ను సంరక్షించే ఫుల్ టైమ్ బాధ్యతలను ఆయనకు సర్కార్ అప్పగించింది. ప్రస్తుతం ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీగా ఉన్న ఎస్‌ఎస్ దేశాయ్ ఆస్థానా బ్యాచ్‌మేట్ కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి నుంచి బీఎస్‌ఎఫ్ అడిషనల్ చార్జ్‌గా దేశాయ్ ఉన్నారు. ఇప్పుడు ఈ బాధ్యతలను రాకేశ్ ఆస్థానాకు అప్పగించారు.