
జడ్చర్ల, వెలుగు: పట్టణంలో ఇద్దరు యువతులు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీకి చెందిన వనజ(18), బురెడ్డిపల్లి గ్రామానికి చెందిన దీవెన(19) ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోయారు. బురెడ్డిపల్లి బృందావనం కాలనీకి చెందిన రమేశ్ తన పెద్ద కూతురు దీవెనను ఆదివారం ఉదయం 6 గంటలకు జడ్చర్ల బస్టాండ్ లో షాద్నగర్ వెళ్లే బస్సు ఎక్కించాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు.
గౌరీశంకర్ కాలనీకి చెందిన ఈర్ల అలివేలు కూతురు వనజ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కనిపించకుండా పోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఎర్రమన్నుగుట్టకు చెందిన సాయి తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ వనజ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.