
రాకేష్ మాస్టర్ మరణ వార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.దాదాపు 1500ల సిన్మాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశారు. కొందరికి తన స్కూల్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే..
అయితే రాకేష్ మాస్టర్ కు సంబంధించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించాడు. ప్రభాస్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు రాకేష్ మాస్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ ఫోటోను అభిమానులు వైరల్ చేస్తూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.
సోషల్ మీడియా స్టార్ గా రాకేష్ మాస్టర్
ఆట,ఢీ షోలో కనిపించిన రాకేష్ మాస్టర్ కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ జబర్దస్త్ వంటి కామోడీ షోలో కూడా పాల్గొన్నారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ముక్కుసూటిగా ప్రముఖులపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో రాకేష్ మాస్టర్ ఫేమస్ అయ్యారు. తర్వాత ఆయన ఏది మాట్లాడినా వైరల్ అయ్యేది. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాకేష్ మాస్టర్ పై యాదవ సంఘాలు కేసు నమోదు చేశారు.