కట్టించుకున్న రాఖీని ఎలా తొలగించాలి.. ఎక్కడ పడేయాలి..

కట్టించుకున్న రాఖీని ఎలా తొలగించాలి.. ఎక్కడ పడేయాలి..

హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజున, స్నాన, దానాలు, తర్పణాలు, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని  చెప్పబడింది. రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పండుగ అయిన తరువాత  రాఖీని ఎలా తీయాలి.. చేతికి ఉండగానే పెరిగిపోతే ( తెగడం.. విరగడం లాంటివి) జరిగితే ఏంచేయాలి.. అసలు రాఖీ కట్టేటప్పుటు ఏఏ నియమాలు పాటించాలో   ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ పౌర్ణమి గడియలు ఉన్నా...  భద్ర నీడ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదని పురాణాలు చెబుతున్నాయి.  రావణాశురుడు చెల్లెలు సూర్పణక భద్ర గడియల్లో రక్ష (రాఖీ ) కట్టిందని.. అందవలననే యుద్దంలో మరణించాడని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది రక్షా బంధన్ ను ఆగస్టు 30, ఆగస్టు 31 తేదీల్లో జరుపుకోవాలి.   కాని   ఆగస్టు 30న   భద్ర నీడ ఉంది.   ఆగస్టు 30న ఉదయం 10.12 గంటల నుంచి ... ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల వరకు ఉంది. అయితే, ఆగస్టు 30న రాత్రి 8:58 వరకు భద్ర నీడ ఉంది. అందుకే రాఖీని ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల సమయంలోపు జరుపుకోవాలి.

రాఖీని ఎక్కువ రోజుల పాటు చేతికే ఉంచుకుంటే అపవిత్రం అవుతుంది. కొన్ని రోజుల తరువాత మంచి రోజుని చూసుకుని రాఖీని తొలగించాలి. తొలగించిన రాఖీని ఎక్కడబడితే అక్కడ పడేయకూడదు. ఓ ఎర్రని వస్త్రంలో చుట్టి దేవుని మందిరంలో ఉంచండి. విరిగిపోయిన లేదా తెగిపోయిన రాఖీలను చేతిలో ఉంచకూడదు. అటువంటి రాఖీలను చేతికి ఉంచుకుంటే సోదరులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా విరిగిపోయిన రాఖీలను ఎక్కడబడితే అక్కడ పడవేయకుండా.. ప్రవహించే నీటిలో పడవేయాలి. దగ్గరలో ప్రవహించే నీరు లేని పక్షంలో .. విరిగిపోయిన రాఖీని   ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు కింద ఉంచాలి 


రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు దిశలోను, సోదరి ముఖం పడమర లేదా ఉత్తరం దిశలోను ఉండాలి. రాఖీ కట్టే సమయంలో ఎవరి ముఖానికైనా దక్షిణ ముఖంగా ఉండకూడదు. అది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అక్కా చెల్లెళ్లు రాఖీ కట్టేటప్పుడు నలుపు రంగు లేదా  విరిగిపోయిన రాఖీని కట్టకూడదు. సోదరులు  ఉత్తరీయం ( కండువా) కలిగిఉండాలి.  కుర్చీలో కాని, బల్లపై కాని కూర్చోవాలి.. కింద చాప వేసుకొని కూర్చొని రాఖీ కట్టించుకోవచ్చు.   అంతేకాని మంచంపై కూర్చొని రాఖీ కట్టించుకోకూడదు. అక్కాచెల్లెళ్లు నైరుతి దిశలో ఉండి  ముహూర్త సమయంలో రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.  

సోదరీమణులు ఎప్పుడూ నలుపు రంగు లేదా విరిగిన రాఖీని కట్టకూడదు. పండుగ జరుపుకునేటప్పుడు సోదరులు ఎల్లప్పుడూ రుమాలుతో తలలు కప్పుకోవాలి. భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు. రాఖీ కట్టేటప్పుడు సోదరులు నేలపై కూర్చోవాలి.  సోదరీమణులు నైరుతి దిశలో ఉండాలి.  మహూరత్ సమయంలో రాఖీ కట్టాలి. 


రక్షా బంధన్ శ్రావణ పూర్ణిమ తేదీ: 30 ఆగస్టు 2023
రక్షా బంధన్ శ్రావణ పూర్ణిమ తేదీ ముగిసే పమయం:  - ఆగస్టు 31 ఉదయం 07:05 గంటలకు
రక్షా బంధన్ భద్ర ముగింపు సమయం: 30 ఆగస్టు 2023 రాత్రి 09:03 గంటలకు
రక్షా బంధన్ భద్ర ముఖ: ఆగస్టు 30, 2023న 06:31 PM నుండి 08:11 PM వరకు
రాఖీ కట్టడానికి సమయం: 30 ఆగస్టు 2023 రాత్రి  09.03 నుంచి  రాత్రి 11.00 గంటల వరకు
        31 ఆగస్టు 2023 తెల్లవారుజామున 04.03 గంటల నుంచి ఉదయం 07.05 వరకు

ఆగస్టు 30 రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి అది భద్రకాలం కాదు.  అయినా హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం రాత్రి 11 గంటల తరువాత తెల్లవారుజామున 3.00 గంటల వరకు క్షుద్రపూజలు చేస్తుంటారని చెబుతుంటారు.  అలాంటి సమయం మంచిది కాదని చెబుతుంటారు