పద్మారావునగర్, వెలుగు: రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి– కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి– -కాకినాడ టౌన్(రైలు నంబర్ 07039) రైలు ఈ నెల 27న రాత్రి 7.50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో(రైలు నంబర్ 07040) 28న సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థమై ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్‌కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు.
