
బాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా రాఖీ సావంత్ కుపెట్టింది పేరు . హాట్ హాట్‌గా అందాల ప్రదర్శనతో పాటు డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించింది. ఆమె స్టెప్పులకు కుర్రాళ్ల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లేవి. అయితే 2022 లో ఆదిల్ ఖాన్ దుర్రానీని వివాహం చేసుకుని దుబాయ్ లో నివసిస్తోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది. లేటెస్ట్ గా దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది . రావడం రావడమే ఈ సారి ఆమె నేరుగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
'నేనే OG ఐటెం గర్ల్': తమన్నాపై రాఖీ ఫైర్
ఇటీవల తమన్నా వరుసగా ఐటెం సాంగ్‌లు చేయడంపై రాఖీ సావంత్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌కి ఒరిజినల్ ఐటెం గర్ల్ తానేనని చెప్పింది. తన అడుగుజాడల్లోనే తమన్నా వంటి నటీమణులు నడుస్తున్నారంటూ వ్యాఖానించింది. వీళ్లు మమ్మల్ని చూసి చూసి ఐటెం సాంగ్‌లు చేయడం నేర్చుకున్నారు. మొదట్లో హీరోయిన్ గా చేశారు.. కానీ ఆ కెరీర్ సరిగ్గా నడవకపోయేసరికి ఐటమ్ సాంగ్స్ చేస్తోందని మండిపడింది. ఇప్పుడు మా కడుపు మీద కొట్టి ఐటెం సాంగ్‌లు చేస్తున్నారు. అసలు ఒరిజినల్ ఐటం గర్ల్ నేను మాత్రమే .. ఇకపై మేమే హీరోయిన్లుగా చేస్తాం అంటూ రాఖీ ఫైర్ అయింది. ప్రస్తుతం వస్తున్న ఐటెం సాంగ్‌లలో తన పాత పాటల్లో ఉండే మెరుపు, ఎనర్జీ లేదని కూడా రాఖీ వ్యాఖ్యానించింది.
ఐటం సాంగ్స్ తో రచ్చ చేస్తున్న తమన్నా
రాఖీ విమర్శలు ఎలా ఉన్నా, తమన్నా భాటియా మాత్రం వరుస డ్యాన్స్ నంబర్లతో అదరగొడుతోంది. ఇటీవల విడుదలైన ఆమె పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న వెబ్ సిరీస్ ది బా**ర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ లోని ఈ పాట వైరల్ సెన్సేషన్ గా మారింది. స్త్రీ 2 చిత్రంలో తమన్నా చేసిన 'ఆజ్ కీ రాత్' ప్రత్యేక గీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న రైడ్ 2 లో కూడా ఆమె హనీ సింగ్‌తో కలిసి ఐటెం సాంగ్‌లో స్టెప్పులు వేయనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంలో చేసిన 'కావాలా' పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ డ్యాన్స్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ పాటతో తమన్నా క్రేజ్ దక్షిణాది, ఉత్తరాదిలో మరింత పెరిగింది.
యాక్షన్, అడ్వెంచర్ సినిమాలపై ఫోకస్
డ్యాన్స్ నంబర్లతో పాటు, తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై కూడా తమన్నా దృష్టి సారించింది. నాకు యాక్షన్ సినిమాలు చేయాలనే కోరిక బలంగా ఉంది. అది నేను సాధించాలనుకుంటున్న లక్ష్యం. అలాగే, అడ్వెంచర్ జానర్ చిత్రాలు కూడా చేయాలనుకుంటున్నా. ఈ జానర్ ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు, కానీ ఆ సాహసాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె చెప్పింది. ప్రస్తుతం, తమన్నా భాటియా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వవాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, ఆమె నటించిన వెబ్ సిరీస్ డూ యూ వాన్నా పార్ట్‌నర్ (Do You Wanna Partner) ఇటీవల విడుదలైంది. మరి రాఖీ సావంత్ వ్యాఖ్యలపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.