రిలీజ్‌‌‌‌కు రెడీగా రక్షణ

రిలీజ్‌‌‌‌కు రెడీగా రక్షణ

ఆర్‌‌‌‌‌‌‌‌ఎక్స్ 100, మంగళవారం లాంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌‌‌‌తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌‌‌‌పుత్.. ఈసారి పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనుంది. ఆమె ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు. జూన్ 7న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రణదీప్ మాట్లాడుతూ ‘పాయల్‌‌‌‌ను భిన్నంగా, సరికొత్త కోణంలో చూపించే సినిమా ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్‌‌‌‌లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. రోషన్, మానస్‌‌‌‌, రాజీవ్ క‌‌‌‌న‌‌‌‌కాల‌‌‌‌, వినోద్ బాల‌‌‌‌, శివ‌‌‌‌న్నారాయ‌‌‌‌ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.