కౌలూన్: ఇండియా యంగ్ షట్లర్ రక్షిత రామ్‌రాజ్.. హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రక్షిత 21–18, 24–22తో టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, వరల్డ్ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫే (చైనా)పై అద్భుత విజయం సాధించింది. 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రక్షిత.. ఓవర్‌హెడ్ డిసెప్షన్స్‌తో ఆకట్టుకుంది.
రెండో గేమ్‌లో గట్టి పోటీ ఎదురైనా.. కీలక టైమ్‌లో వరుస పాయింట్లతో హోరెత్తించింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21–11, 21–18తో రాస్మస్ గిమ్కే (డెన్మార్క్)పై, కిడాంబి శ్రీకాంత్ 12–21, 21–18, 21–14తో యో టీ బిన్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–19, 21–16తో నూర్ మహ్మద్ అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)పై నెగ్గారు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 20–22, 13–21తో లారెన్ లామ్–అలిసన్ క్వియెన్ లీ (మలేసియా) చేతిలో ఓడారు.
