టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో వైభవ్ సూర్యవంశీ, సానియా మీర్జాకు చోటు

 టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో వైభవ్ సూర్యవంశీ, సానియా మీర్జాకు చోటు

న్యూఢిల్లీ: టీమిండియా వండర్‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీకి అరుదైన గౌరవం దక్కింది. విభిన్న రంగాల ప్రముఖుల కోసం ‘టైమ్‌‌’ సంస్థ తొలిసారిగా రూపొందించిన ‘టైమ్‌‌ 100 నెక్ట్స్‌‌’ జాబితాలో వైభవ్‌‌కు చోటు లభించింది. ఇండియా నుంచి మొత్తం 9 మందికి అవకాశం దక్కింది. ఇన్నోవేటర్స్‌‌ లిస్ట్‌‌లో వైభవ్‌‌, మీరాబాయి చాను (వెయిట్​ లిఫ్టర్‌‌), కుంకుమ్‌‌ మోహోద్‌‌ (ఆర్చర్‌‌), ఫినామ్స్‌‌లో లవ్లీనా బొర్గోహైన్‌‌ (బాక్సింగ్‌‌), డి. గుకేశ్‌‌ (చెస్‌‌), విత్య రామ్‌‌రాజ్‌‌ (అథ్లెటిక్స్‌‌), లీడర్స్‌‌లో  సవితా పూనియా (హాకీ), అడ్వకేట్స్‌‌లో సానియా మీర్జా (టెన్నిస్‌‌), హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (క్రికెట్‌‌) ఉన్నారు. 

అతిపిన్న వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్‌‌.. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో బిహార్‌‌ జట్టుకు కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. 2025 ఐపీఎల్‌‌లో 14 ఏళ్ల వయసులో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ తరఫున అరంగేట్రం చేసి గుజరాత్‌‌ టైటాన్స్‌‌పై శతకం బాది మెన్స్‌‌ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్‌‌గా నిలిచాడు. 2026 ఐపీఎల్‌‌లో అత్యధిక రన్స్‌‌ చేసిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు. విమెన్స్‌‌ టెన్నిస్‌‌లో సానియా ఆరు గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్స్‌‌ నెగ్గింది.