జొహనెస్‌బర్గ్: బ్యాటింగ్‌లో చెలరేగిన సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో గురువారం ముగిసిన తొలి టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీ జట్టు 1–0 ఆధిక్యంలో నిలిచింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 12 రన్స్ లక్ష్యాన్ని సౌతాఫ్రికా 1.3 ఓవర్లలో 12/1 స్కోరు చేసి ఛేదించింది. ఐడెన్ మార్‌క్రమ్ (8 నాటౌట్) గెలిపించాడు.
అంతకుముందు 100/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌటైంది. లిటన్ దాస్ (39) మెరుగ్గా ఆడినా మిగతా వారు నిరాశపర్చారు. సిమోన్ హార్మర్ 6 వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. రబాడ 3 వికెట్లతో అండగా నిలిచాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీసిన రబాడకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
