ఆటతోనే గౌరవం సంపాదించుకున్న ఆర్యవీర్.. ప్రశంసించిన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్

ఆటతోనే గౌరవం సంపాదించుకున్న ఆర్యవీర్.. ప్రశంసించిన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్

ముంబై: ప్రసిద్ధమైన ఇంటి పేరు ఉన్నప్పుడు ఆటలో విమర్శలు రావడం సహజమే అయినా.. అండర్‌‌–19 ఆసియా కప్‌‌లో భారీగా రన్స్‌‌ చేయడంతో ఆర్యవీర్‌‌ క్రికెట్‌‌ ప్రపంచం నుంచి గౌరవం సంపాదించాడని తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌‌ అన్నాడు. ‘ఆసియా కప్‌‌లో పాక్‌‌తో జరిగిన ఫైనల్లో ఆర్యవీర్‌‌ రాణించడం చాలా సంతోషాన్నిచ్చింది. 

అతను రన్స్‌‌ చేయడమే కాదు, భారీ స్కోర్లు చేసేందుకు దోహదపడ్డాడు. ఈ విజయంపై జట్టు మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నా. గౌరవం కావాలంటే పెద్ద ఇన్నింగ్స్‌‌లు ఆడాలని ఆర్యవీర్‌‌తో ఎప్పుడూ చెబుతుండేవాడిని. ఈ టోర్నీలో అతడు ఆ లక్ష్యాన్ని సాధించాడు’ అని వీరూ పేర్కొన్నాడు. వరల్డ్‌‌ క్రికెట్‌‌ ముందు ఆర్యవీర్‌‌ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, ఇకపై నిలకడగా భారీ స్కోర్లు చేయడమే ముఖ్యమన్నాడు. ‘ఒక ఆటగాడి ఆట చూసే వరకు పేరునే చూస్తారు. ప్రదర్శన ఇచ్చిన తర్వాతే ప్రతిభ ఉందని చెబుతారు. ఇంటి పేరు కారణంగా ఆర్యవీర్ కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు రావచ్చు. కానీ ఇప్పుడు అతడి ప్రతిభ అందరికీ తెలిసింది. ఇకపై దేశం నుంచి అతడికి అభిమానమే లభిస్తుందని భావిస్తున్నాను’ అని సెహ్వాగ్‌‌ వ్యాఖ్యానించాడు.