ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) వరుసగా 13వ రోజూ కొనుగోళ్లు కొనసాగించడం, గ్లోబల్‌గా రాగి, అల్యూమినియం ధరలు పడడంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 990 పాయింట్లు (1.20 శాతం) ఎగబాకి 83,022 వద్ద ముగియగా, నిఫ్టీ 286 పైగా లాభపడి 25,514 వద్ద సెటిలైంది. ఈ ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 6 లక్షల కోట్లు పెరిగి రూ. 512 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌ఐఐలు గురువారం నికరంగా రూ.7,411 కోట్లవిలువైన షేర్లు కొన్నారు. ఒక్క నవంబర్ నెలలోనే వీరి నికర పెట్టుబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. రాగి, అల్యూమినియం ధరలు భారీగా పడిపోవడంతో తయారీ ఖర్చులు తగ్గుతాయని అంచనాలతో ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు పెరిగాయి.
