బుడాపెస్ట్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టోటల్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 9 నుంచి 12వ స్థానం కోసం జరుగుతున్న పోరులో అర్జున్ అర్మెగెడాన్‌లో జోర్డాన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు. ఓ దశలో 8–12 స్కోరుతో వెనకబడినా.. ఆర్మెగెడాన్‌లో నిలకడగా ఆడాడు. నల్లపావులతో వాన్ ఫారెస్ట్ చాలాసేపు ఆధిక్యంలో కొనసాగినా.. 34వ ఎత్తులో చేసిన చిన్న తప్పిదం అర్జున్‌కు కలిసొచ్చింది.
9వ స్థానం కోసం జరిగే పోరులో అర్జున్... హైయిక్ ఎం. మార్టిరోసియన్‌తో తలపడతాడు. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్న గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. నల్లపావులతో ఆడి 11.5–8.5 స్కోరుతో ఆటను ముగించాడు. దాంతో 21వ స్థానం కోసం జరిగే పోరులో అభిమన్యు మిశ్రాతో ఆడతాడు. ఒకవేళ ఈ గేమ్‌లో ప్రజ్ఞా ఓడిపోయి ఉంటే.. తన సోదరి వైశాలితో తలపడాల్సి వచ్చేది.
