‘డాక్టర్‌‌‌‌ జి’లో రకుల్

‘డాక్టర్‌‌‌‌ జి’లో రకుల్

ఈ మధ్యనే ‘కట్‌‌పుత్‌‌లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రకుల్‌‌ ప్రీత్‌‌ సింగ్.. త్వరలో మరో రెండు సినిమాలతో రాబోతోంది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి రకుల్ నటించిన ‘థ్యాంక్ గాడ్’ మూవీ అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో రకుల్ పోలీసాఫీసర్‌‌‌‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంది. రీసెంట్‌‌గా విడుదలైన ట్రైలర్ కూడా ఇంటరెస్టింగ్‌‌గా ఉండటంతో ఈ సినిమా కోసం రకుల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే ఆమె యాక్ట్ చేసిన మరో మూవీ రిలీజ్‌‌కి రెడీ అయిపోయింది.

ఆయుష్మాన్‌‌ ఖురానా హీరోగా అనుభూతి కశ్యప్‌‌ తెరకెక్కిస్తున్న ‘డాక్టర్‌‌‌‌ జి’లో ఫిమేల్‌‌ లీడ్‌‌గా నటించింది రకుల్. ఆయుష్మాన్ గైనకాలజిస్ట్‌‌గా కనిపించనున్నాడు. రకుల్‌‌ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు. త్వరలోనే అఫీషియల్‌‌గా అనౌన్స్ చేయబోతున్నారు. అంటే ఒకే నెలలో.. పది రోజుల గ్యాప్‌‌లో.. రెండు సినిమాలతో విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది రకుల్.