
రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో టాలీవుడ్‌కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. తమిళనాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్ , మెర్విన్ సంగీత ద్వయం ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు.
‘తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి స్వాగతం’ అంటూ రామ్ సోషల్ మీడియా ద్వారా వీరికి వెల్ కమ్ చెప్పాడు. వీళ్లిద్దరి అసలు పేర్లు వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. ‘వడా కర్రీ’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి ధనుష్ ‘పటాస్’, ప్రభుదేవా ‘గులేబకావళి’, కార్తి ‘సుల్తాన్’ చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు.