రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. ఇందుకోసం చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సహా యూనిట్ సభ్యులు శుక్రవారం అక్కడికి వెళ్లారు. శనివారం నుంచి అక్కడి అందమైన ప్రదేశాల్లో రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటపై ఓ పాటను చిత్రీకరించనున్నారు.
ఇందుకోసం ఆస్కార్ విజేత ఏ.ఆర్.రహమాన్ ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తుండగా జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవోపీ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి సహా పలువురు టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయబోతున్నారు.
