ఫోర్బ్స్ మ్యాగ్‌జైన్ పై రామ్‌ చరణ్‌ ఉపాసన.. వైరల్ అవుతున్న ఫోటో

ఫోర్బ్స్ మ్యాగ్‌జైన్ పై రామ్‌ చరణ్‌ ఉపాసన.. వైరల్ అవుతున్న ఫోటో

ఆర్ఆర్ఆర్(RRR) సూపర్ హిట్ తరువాత రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సైతం ఫిదా అయ్యారు.ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ లు కూడా అందుకున్నారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆయనకు గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఏంట్రాప్రిన్యూర్ గా చాలా అవార్డ్స్ అందుకున్నారు. 

తాజాగా ఈ జంట మరో ఘనతను సాధించారు. ఈసారి ఏకంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో వారి కెరీర్ లో ఇదొక మైలు రాయిగా మిగలనుంది. అది చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్,అంజలి,నవీన్ చంద్ర,సునీల్ తదితరులు కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.