చిరుకు చరణ్ బర్త్ డే విషెస్.. వైరల్

చిరుకు చరణ్ బర్త్ డే విషెస్.. వైరల్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజు వేడుకలు ఇవాళ గ్రాండ్ గా జరుగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు. తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోని కూడా చరణ్ షేర్ చేశాడు. దానికి చెర్రి మంచి క్యాప్షన్ ను కూడా జోడించాడు. 'వరల్డ్ బెస్ట్ డాడ్..హ్యాపీయెస్ట్ బర్త్ డే' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఇద్దరు వైట్ అండ్ వైట్ లో కనువిందు చేశారు.

హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో మెగాస్టార్ తన బర్త్ డే పార్టీని.. ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకుంటున్నారు. కాగా, ఈ ఏడాదిలో చిరు, చరణ్ కలిసి తొలిసారి `ఆచార్య` మూవీలో నటించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఓ మూవీతో బీజీగా ఉండగా.. చిరు గాడ్ ఫాదర్, భోళశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు.