
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) వెబ్ సిరీస్ చేస్తున్నారా? అది కూడా బాలీవుడ్ లో. అవును దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో హఠాత్తుగా ప్రత్యేక్షమై రామ్ చరణ్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ వీడియోను స్వయంగా రామ్ చరణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది చూసిన చరణ్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇందులో ఎప్పుడు యాక్ట్ చేశావ్ అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. "షో మీ ది సీక్రెట్" అనే వెబ్ సిరీస్ కు సంబంధించింది అని తెలుస్తోంది. ఇంకా ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు.. దీపికా పదుకొనే(Deepika padukone), రణవీర్ సింగ్(Ranveer singh), త్రిషా(Thrisha) ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సిరీస్ లో చరణ్ ఏజెంట్ గా కనిపించనున్నాడని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఆర్ఆర్ఆర్(RRR) మూవీ తరువాత రామ్ చరణ్ యాక్ట్ చేసిన వీడియో కావడంతో ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక వీడియో కింద జై చరణ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. మరి ఈ సిరీస్ లో రామ్ చరణ్ ఫుల్ క్యారెక్టర్ చేశారా లేక గెస్ట్ రోల్ లో కనిపిస్తారా అనేది త్వరలోనే తెలియనుంది.