గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిపై ఓవర్సీస్‌లో భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 3న జరిగే తెలుగు ప్రీమియర్ షోల కోసం మేకర్స్ ప్రత్యేక టికెట్ ధరలను నిర్ణయించారు.
యూఎస్ థియేటర్లో స్టాండర్డ్ 2D ప్రీమియర్ టికెట్లు 25 డాలర్ల వరకు (రూ.2360లు) ఉండగా, ప్రీమియం ఫార్మాట్లకు అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. మొదటి వారం రెగ్యులర్ షోల టికెట్ ధరలు 18 నుంచి 20 డాలర్ల మధ్య ఉండనున్నాయని సమాచారం. PLF స్క్రీన్లకు $2 నుంచి $5 వరకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయని మేకర్స్ తెలిపారు.
అయితే ఈ భారీ హైప్ మధ్య కొన్ని థియేటర్లలో 'పెద్ది' ప్రీమియర్ టికెట్ ధర $38 అని టాక్ కూడా ఉంది. ట్యాక్స్, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు అన్నీ కలిపితే $40 నుంచి $42 వరకు వెళ్తుందని క్రిటిక్స్ చెబుతున్నారు. అంటే ఒక్క ప్రీమియర్ టికెట్టు ధర రూ.3,965 (42 డాలర్లు) అంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ విషయం మీద సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. ఈ క్రమంలోమనే ఓ తెలుగు సినీ అభిమాని చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.‘ఇది RRRనా? లేక బాహుబలి 2 హ? 40 డాలర్లు టికెట్ పెట్టేంత మాగ్నమ్ ఓపస్ మూవీనా?’ అంటూ ప్రశ్నించారు
#PEDDI 🚨
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 10, 2026
North America Ticket Pricing - Official Update
TELUGU:
Premieres June 3rd Wednesday:
Standard 2D: $25 / $20
PLF: $5 extra
Speciality Formats: $7-$10 extra
Week 1 :
Standard 2D: $20 / $18
PLF: $2-$5 extra
Speciality Formats: $7-$10 extra…
ఓవర్సీస్ మార్కెట్‌లో టికెట్ ధరలపై చర్చ..
అయితే, స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రతిసారి ఓవర్సీస్ మార్కెట్‌లో టికెట్ ధరలపై చర్చ జరగడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ‘పెద్ది’ ప్రీమియర్ షోల టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకుడికి అందనంతగా ఉండటంతో, అమెరికాలో ఉన్న తెలుగు సినీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు ట్యాక్స్‌తో కలిపి 40 డాలర్లకు చేరుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
వైరల్ అవుతున్న ఫ్యాన్ వీడియో..
ఒక తెలుగు సినీ అభిమాని ‘పెద్ది’ ఓవర్సీస్ టికెట్ ధరలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “భయ్యా.. ఒక మూవీ ఫస్ట్ డే టికెట్ 38 డాలర్లు + ట్యాక్స్ అంటే దాదాపు 40 డాలర్లు అవుతోంది. ఇదేమైనా ‘ఆర్ఆర్ఆర్’నా? లేక ‘బాహుబలి’నా? అంత గ్రాండ్ స్కేల్ మూవీ కాకపోయినా ఇంత రేట్లు ఎందుకు?” అంటూ ప్రశ్నించాడు.
►ALSO READ | Adarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్ మూవీలో భారీ ట్విస్ట్.. ‘మున్నా భయ్యా’ ఎంట్రీతో స్టోరీపై నేషనల్ హైప్
this is only the beginning of so many people’s frustration on the movie ticket prices for Telugu movies in the US.
— Ganeshen🌶️ (@Ganeshen5) May 9, 2026
andharini entha dhochukuntunavu ra ah prices tho, people have completely given up on justifying those ticket prices. @PrathyangiraUS #Peddi pic.twitter.com/y6wL7ZEwUm
అయితే సినిమా బాగుంటుందని, తాను కూడా ఫస్ట్ డే వెళ్లబోతున్నానని చెప్పిన అతను.. “ఇది నా తీట.. కానీ ఒక్కో టికెట్‌కు 38 డాలర్లు పెట్టడం మాత్రం చాలా ఎక్కువ” అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాను మాట్లాడేది 'పెద్ది' సినిమా అని పేరెత్తకుండానే టికెట్ రేట్లపై విమర్శలు చేశాడు.
RAMpage Continues... 💣🔥#PEDDI North America Premieres Pre-Sales $200K and Counting 💥🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 10, 2026
North America by @PrathyangiraUS, Premieres on JUNE 3🔥#PeddiTakeOver @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @venkataskilaru… pic.twitter.com/kxnW847nmD
రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ కారణంగా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా బుకింగ్స్ మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వెర్షన్లకు ప్రత్యేక ప్రీమియర్ షోలు ఉండవని, మొదటి రోజు నుంచే సాధారణ టికెట్ ధరలతోనే సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
