
టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ గా ఉండే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆయన మెగా హీరోలతో కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. వారికి అపోజిట్ గా ట్వీట్స్ వేయడం, వారిపై సెటైరికల్ గా సినిమాలు తీయడం ఇలా ఎదో ఒకరకంగా వారిపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇది ఆయన ఒప్పుకోకపోయాయినా అందరికి తెలిసిన విషయమే.
అలాంటి వర్మ తాజాగా మెగా హీరోలకు ఫేవర్ గా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సినిమాటోగ్రఫీ యాక్ట్ బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో ఏపీ మంత్రి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందని, దానివల్ల సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై చిరంజీవి కౌంటర్ కూడా వేశారు. తీరా అది కాస్త వివాదంగా మారింది.
తాజాగా ఈ కాంట్రవర్సీ పై వర్మ రియాక్ట్ అవుతూ.. హీరోలకు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం తప్పు కాదు. వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి, వారివల్ల కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు. అలా నాకు ఇస్తే నేను కూడా తీసుకుంటాను. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల దాన్ని తిరిగిరాబట్టుకోవడం కోసం టికెట్ రేట్స్ పెంచాల్సి వస్తుంది. ఆ భారం ప్రజలపై పడుతుందనుకోవడం కూడా పూర్తిగా తప్పు. వారికి నచ్చితే చూస్తారు.. లేదా చూడరు. ఇతర భాషల్లో 20-40 కోట్లతో సినిమాలు తీస్తున్నారు. తెలుగులో ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు అంటే.. తెలుగు సినిమాలు, స్టార్స్ కి ఉన్న మార్కెట్ వేరు” అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.