అది అర్థం కాకపోవడం పవన్ దురదృష్టం: వర్మ

అది అర్థం కాకపోవడం పవన్ దురదృష్టం: వర్మ

డైరెక్టర్ రాంగోపాల్ వార్మ మరోసారి మెగా బద్రర్స్ ను టార్గెట్  చేస్తూ సెటైర్లు వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబును ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన ఓ వీడియోను వర్మ తన ట్విట్టర్లో రిలీజ్ చేశారు. నాగబాబు.. పవన్ కళ్యాణ్ కు , చిరంజీవికి ఇంపార్టెంట్ కావొచ్చు కానీ తనకు కాదన్నారు. తాను పవన్ కళ్యాణ్ పై గానీ.. జనసేన మీద గానీ  చేసిన ట్వీట్స్ ఒక అభిమానిగా చేసినవని చెప్పారు. ఈ విషయం అర్థం కాకపోవడం తన దురదృష్టమని.. తన కన్నా ఎక్కువ పవన్ దురదృష్టమని తెలిపారు. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టే నాగబాబును సలహాదారుడిగా పెట్టుకుంటే తర్వాత ఎలాంటి ఫలితాలుంటాయో ప్రజలే చెబుతారని వర్మ చెప్పారు. పవన్ కళ్యాణ్ కొంచెం మీ అన్నయ్యను కూడా చూసుకోండి అంటూ వీడియోకు  క్యాప్షన్ ఇచ్చారు.

 ఇటీవలే చంద్రబాబుతో పవన్ భేటీ అయినప్పటి నుంచి వర్మ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాపులను చంద్రబాబు వద్ద  తాకట్టు పెట్టారని ఆరోపించారు. అప్పటి నుంచి జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మకు కౌంటర్ ఇస్తున్నారు. వర్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా ట్విట్టర్లో విమర్శలు చేస్తున్నారు.