హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాను.. చిరుకి పద్మ విభూషణ్ రావడంపై వర్మ ట్వీట్

హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాను.. చిరుకి పద్మ విభూషణ్ రావడంపై వర్మ ట్వీట్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన చేసే ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదం కోసమే ట్వీట్స్ చేస్తారా? లేక ఆయన చేసే ట్వీట్స్ వివాదానికి కారణమవుతాయా అనేది అర్థం కాని విషయం. తాజాగా మరోసారి అలాంటి ట్వీట్ చేశారు వర్మ. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వర్మ సైతం చిరుకి తనదైన సెటైరికల్ స్టైల్లో ట్వీట్ శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆయన శుభాకాంక్షలు తెలిపిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

నేను శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి ఎప్పుడూ వినలేదు. వారిని మెగా స్టార్‌తో సమానమైన స్థితిలో ఉంచడానికి కూడా. అందుకే నేను ఈ అవార్డుతో థ్రిల్‌గా లేను. ఒకవేళ చిరంజీవి గారికి సంతోషంగా ఉంది అంటే.. నేను కూడా సంతోషంగా ఉండటానికి నటిస్తాను.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. చిరు ట్విట్టర్ ను కూడా తప్పుగా టాగ్ చేశాడు వర్మ. @kchirutweets కి బదులు @chirutweets అని రాసుకొచ్చాడు. దీంతో చిరు ఫ్యాన్స్ వర్మపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.