Ayalaan OTT official : ఓటీటీలోకి వచ్చేస్తున్న అయలాన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ayalaan OTT official : ఓటీటీలోకి వచ్చేస్తున్న అయలాన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, ప్రిన్స్, మహావీరుడు సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యాయి.దీంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.  

రీసెంట్గా శివ కార్తికేయన్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నసైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ మూవీ అయలాన్(Ayalaan). ఇపుడు ఈ సినిమా జనవరి 26న తెలుగులో రిలీజై మంచి కలెక్షన్స్తో దూసుకెళ్తుంది.సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్‌.రవికుమార్(R Ravikumar) తెరెకెక్కించారు. అయితే అయాలాన్ మూవీ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

అయలాన్ సినిమా ప్రముఖ  ఓటీటీ ప్లాట్ఫామ్ సన్నెక్స్ట్ లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్నిసన్ సన్ నెక్స్ట్అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. త్వరలోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. కానీ, స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం డేట్ ఫిక్స్ చేయలేదు. అయితే, వచ్చే నెల (ఫిబ్రవరి 9) నుంచి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు  తెలుస్తుంది.

ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ,కన్నడం,మలయాళ  భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. అయలాన్ మూవీ ముందుగా సంక్రాంతికి తమిళంలో రిలీజై 15 రోజుల్లోనే  అరవై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం తెలుగులో థియేటర్లో అందుబాటులో ఉంది. 

  • Beta
Beta feature