
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన పేరు. ఆ పేరు వెనుకాల ఉండే విజన్ చాలా అరుదు.గత వారం నుంచి సోషల్ మీడియాలో వర్మ చేసే పోస్ట్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓ వైపు తెలంగాణాలో కొత్త సర్కారుపై..మరోవైపు యానిమల్ సినిమాపై తనదైన శైలిలో విభిన్నమైన ట్వీట్స్తో ఫ్యాన్స్ లో జోష్ పెంచేస్తున్నారు.
లేటెస్ట్గా రామ్ గోపాల్ వర్మ ఓ సూచన చేశారు. సరికొత్త హంగులతో నిండిన కొత్త సెక్రటేరియట్(Secretariat)ను కానుకగా ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు రేవంత్ రెడ్డి(Revanth Reddy) థ్యాంక్స్ చెప్పాలంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కాగా, ప్రస్తుతం ఈ కొత్త సచివాలయం భవనం దగ్గర చాలా మంది సెల్ఫీస్,వీడియోస్ తీసుకుని రేవంత్కు కేసిఆర్ ఇచ్చిన బహుమతి అంటూ పోస్ట్స్ చేస్తున్నారు. దీంతో రామ్ గోపాల్ వర్మ కూడా నెటిజన్స్ బాటలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది.
I think @revanth_anumula should really thank #kcr for GIFTING him a brand new SECRETARIAT ???
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2023