కుట్రలకు, ఆలోచనలకు మధ్య వ్యూహం.. రెండో టీజర్ వచ్చేసింది

కుట్రలకు, ఆలోచనలకు మధ్య వ్యూహం.. రెండో టీజర్ వచ్చేసింది

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఏపీ ఎలక్షన్స్ సమయంలో రిలీజ్  చేస్తానని ఆర్జీవీ ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వ్యూహం నుండి మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, జగన్ పై జరిగిన కుట్రలు, ఆయన జీవితంలో 2009 నుండి 2014 ఎలెక్షన్స్ వరకు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్,చంద్రబాబు, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ రోశయ్య.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. వ్యూహం సినిమాతో ఆర్జీవీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేయనున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఈ సినిమా విడుదల తరువాత రాజకీయంగా ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.