బాబ్రీ కేసు విచారణ నేడే

బాబ్రీ కేసు విచారణ నేడే

వెలుగు: అయోధ్యలోని ‘రామ జన్మభూమి బాబ్రీ మసీదు’ కేసు మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భూ వివాదంపై వాదనలు విననుంది. ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో, పోయిన నెల 29న జరగాల్సిన కేసు విచారణను సుప్రీం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.