జమ్ము కశ్మీర్ ప్రత్యేక రాష్ట్రమేం కాదు : రామ్ మాధవ్

జమ్ము కశ్మీర్ ప్రత్యేక రాష్ట్రమేం కాదు : రామ్ మాధవ్

ఆర్టికల్ 370ని తొలగిస్తాం

దీనికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కశ్మీర్ సమస్యకు కారణం నెహ్రూనే

కశ్మీర్ స్వయంప్రతిపత్తి తాత్కాలికమే అని నెహ్రూనే చెప్పారు

బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ కామెంట్స్

ఢిల్లీ : కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని తొలగిస్తామంటూ లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలను సమర్థించారు బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్. కశ్మీర్ లో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలకు దారి చూపడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యం అన్నారాయన.తాము అదే దారిలో వెళ్తున్నాం అన్నారు.

ఆర్టికల్ ను అమలు చేసిన ప్రధానమంత్రి నెహ్రూనే అది తాత్కాలికం అని చెప్పారని గుర్తుచేశారు రామ్ మాధవ్. కొంతకాలానికి అది దానికదే రద్దవుతుందని ఆనాడు నెహ్రూ చెప్పారన్నారు. కశ్మీర్ శాశ్వతంగా ప్రత్యేకమైనదేమీ కాదన్నారు. కశ్మీర్ సమస్యలను దశల వారీగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అప్పటివరకు మాత్రమే ఆర్టికల్ 370  కొనసాగుతుందన్నారు. లోక్ సభలో అమిత్ షా చెప్పింది చారిత్రక సత్యమని చెప్పారు.