అయోధ్యకు చేరుకున్న 5,500 కిలోల ధ్వజ స్తంభం

అయోధ్యకు చేరుకున్న  5,500 కిలోల ధ్వజ స్తంభం

అయోధ్యలో త్వరలో తెరుచుకోనున్న రామ మందిరంలో మరొక అద్భుతమైన నిర్మాణం గురించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే ధ్వజ స్తంభం. దీని బరువు 5,500కిలోలు, పొడవు 44అడుగులు. స్వచ్ఛమైన ఇత్తడితో తయారు చేసిన ఈ ధ్వజ స్తంభం.. భారతదేశంలోని ఎత్తైన, బరువైన వాటిల్లో ఒకటిగా నిలవనుంది. ఇది జనవరి 8న అయోధ్యకు చేరింది.

పురాతన హిందూ గ్రంధాల ప్రకారం రూపొందించిన ఈ ధ్వజ స్తంభాన్ని అహ్మదాబాద్‌కు చెందిన ఒక సంస్థ నిర్మించింది. చెక్కపై చెక్కబడిన ఈ ధ్వజ స్తంభంను జనవరి 5న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ జెండా ఊపి 450 కిలోల బరువున్న ప్రత్యేక రథంలో అయోధ్యకు పంపించారు. జనవరి 22 న పవిత్రోత్సవం సందర్భంగా ప్రతిష్టించబోతున్న ఈ ధ్వజ స్తంభాన్ని తమ సంస్థ ఈ గడిచిన 81ఏళ్లలో ఎప్పుడూ ఈ తరహా ధ్వజ స్తంభాన్ని నిర్మించలేదని అహ్మదాబాద్‌లోని శ్రీ అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ మేవాడా అన్నారు.