అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులు బంద్

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లు, ఆఫీసులు బంద్

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 22న మధ్యాహ్నాం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.  . ఆ రోజు శ్రీరాముడి విగ్రహాన్ని మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు.   ఈ వేడుక కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి పలు రాష్ట్రాలు స్కూళ్లకు ఆఫీసులకు సెలవులు ప్రకటించాయి. 

ఉత్తరప్రదేశ్‌ :  జనవరి 22న అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, లిక్కర్ షాపులను  మూసివేయన్నారు. దీపావళి వంటి రోజు లాగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి  పండగ జరుపుకోవాలని సిఎం యోగి ప్రజలను కోరారు

గోవా :  ఉత్తరప్రదేశ్ మాదిరిగానే గోవాలో కూడా జనవరి 22న ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన రోజును దీపావళి మాదిరిగానే ప్రజలు చాలా అనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రజలకు సూచించారు. 

మధ్యప్రదేశ్‌  : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు జనవరి 22న సెలవు దినంగా ప్రకటించారు.  అంతేకాకుండా రాష్ట్రంలోని మద్యం, మాంసం దుకాణాలు కూడా మూసివేయబడతాయి.

చత్తీస్‌గఢ్ :  జనవరి 22న సెలవు ప్రకటించిన రాష్ట్రాలలో చత్తీస్‌గఢ్ కూడా చేరింది.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  

హర్యానా :  జనవరి 22 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఆ రోజున డ్రై డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.