భక్తజనసంద్రమైన అయోధ్య.. రాంలల్లా దర్శనానికి పోటెత్తిన భక్తులు

భక్తజనసంద్రమైన అయోధ్య.. రాంలల్లా దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • ఇకపై స్వామి వారికి రోజూ ఆరు హారతులు 
  • స్లాట్ ఫిక్స్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్
  • అలంకారాలపైనా పూర్తి స్థాయిలో క్లారిటీ 

అయోధ్య: శ్రీరాముడి దర్శనానికి సామాన్య భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు మెయిన్ గేటు వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల ఎక్కువగా ఉంది. అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. రామ్‌ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్‌లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్‌ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు  రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. 

రాం లల్లా వస్త్రధారణ ఇలా

సోమవారం        తెలుపు
మంగళవారం    ఎరుపు
బుధవారం         ఆకుపచ్చ
గురువారం        పసుపు
శుక్రవారం         క్రీమ్ కలర్
శనివారం        నీలం రంగు

ఆరు సార్లు హారతి

రామ్‌లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు.ఇందుకోసం భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.