చివరిదశ చిత్రీకరణలో.. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ..

చివరిదశ చిత్రీకరణలో.. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ..

రామ్ పోతినేని హీరోగా  ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్  పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.  రామ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 22వ సినిమా.  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రిలో కొంత పార్ట్ చిత్రీకరించగా, తాజాగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేశారు. నెల రోజులపాటు సాగే ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. 

ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో  రామ్, భాగ్యశ్రీ బోర్సేపై  ప్రేమ సన్నివేశాలను నైట్ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనుంది.  ఆ  తర్వాత క్లైమాక్స్, ఇతర కీలక సన్నివేశాలను మరో ఇరవై రోజులు మార్నింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేయనున్నారు.  ఈ చివరి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌తో షూట్ మొత్తం పూర్తవుతుంది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్  ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.  నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.