కోహ్లీలా ఉన్నావ్ అంటారు.. బయోపిక్ చేయడానికి నేను రెడీ

కోహ్లీలా ఉన్నావ్ అంటారు.. బయోపిక్ చేయడానికి నేను రెడీ

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati srinu) కంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద(Skanda). లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela) హీరోయినిగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం రామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ కూడా ఇంతకు ముందెన్నడూ లేని విదంగా సరికొత్త మాస్ అవతారంలో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి సిద్దమయ్యాడు. 

Also Read : ఇప్పుడేం చెప్పినా వర్కౌట్ కాదు.. ఇంటికెళ్లి ఎపిసోడ్స్ చూస్కో.. ఇచ్చిపడేసిన శివాజీ

రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచేశారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో రామ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా యాంకర్.. ఈ మధ్య వైరల్ కోహ్లీ బయోపిక్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మీకు ఆ అవకాశం వస్తే చేస్తారా? అని అడిగారు. దానికి రామ్ స్పందిస్తూ.. ఖచ్చితంగా చేస్తాను. విరాట్ నా ఫెవరెట్ ప్లేయర్. ఒకేవేళ నాకు ఆ అవకాశం గనుక వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంకో విశేషం ఏంటంటే నన్ను చాలా మంది కోహ్లీ లా ఉన్నావ్ అంటారు.. అంటూ నవ్వుతూ చెప్పారు రామ్. ప్రస్తుతం రామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.