
భారతీయులకు రాముడి గురించి, రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామాయణం తెలిసిన వారికి రామసేతు ప్రత్యేకత గురించి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాముడు సీత కోసం లంకకు వెళ్ళటానికి నిర్మించిన రామసేతు ఇప్పటికి ఉందని చాలామంది నమ్మకం. ఈ మేరకు ఇంటర్నెట్లో చాలా ఫోటోలు వీడియోలు కూడా సర్కులేట్ అబుతున్నాయి. తాజాగా రామసేతు సజీవంగా ఉందనడానికి సాక్ష్యంగా మరో ఫోటో ఇంటర్నెట్లో సర్కులేట్ అవుతోంది.
యూరోపియన్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన శాటిలైట్ ఇమేజ్ లో ఇండియా శ్రీలంక మధ్య రామసేతు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామేశ్వరం నుండి శ్రీలంక మధ్య 48కిలోమీటర్ల మేర రామసేతు ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రామసేతు ఆడమ్స్ బ్రిడ్జి అనే పేరుతో కూడా పిలుస్తారు. 15శతాబ్దం వరకు రామసేతు వాడుకలో ఉండేదని, ఆ తర్వాత సముద్రంలో వచ్చిన తుఫాన్ల కారణంగా తెగిపోయి ఉండచ్చని చరిత్రకారులు అబిప్రాయపడుతున్నారు.