
బాలరాముడి ప్రాణప్రతిష్టకు అయోధ్య అంగరంగా వైభవంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే భక్తి భావన అందరిలోనూ పెరుగుతున్నది. ఈ క్రమంలోల అయోధ్య రామమందిరాన్ని పోలిన ఉంగరాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచం వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లోని వ్యాపారులు వీటిని తయారు చేస్తున్నారు.
38 గ్రాముల బరువుతో ఈ ఉంగరాలను సూరత్‌కు చెందిన ఒక ఆభరణాల తయారీ సంస్థ తయారు చేస్తుంది. ఈ ఉంగరం అనేక సైజుల్లో లభ్యం కానుంది. ఇది రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం తాము 178 రింగ్‌ల కోసం ఆర్డర్‌లను అందుకున్నామని.. డిమాండ్ ను దీన్ని దృష్టిలో ఉంచుకుని 350 ఉంగరాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.
ఇంతకు ముందు తాము 10 కిలోల 300 గ్రాముల వెండి రామ మందిరాన్ని కూడా తయారు చేశామన్నారు.. మార్కెట్‌లో ఈ రింగ్‌కు డిమాండ్ పెరుగుతోందని వెల్లడించారు. వీటిని ఈ నెల 22వ తేదీన చెన్నై, ముంబయిలలో ఆవిష్కరించనున్నారు.