‘రామారావు ఆన్ డ్యూటీ’ చాలా డిఫరెంట్ మూవీ

‘రామారావు ఆన్ డ్యూటీ’ చాలా డిఫరెంట్ మూవీ

రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జులై 29న విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌కి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తను మాట్లాడుతూ ‘రవితేజ అన్న చిరంజీవి గారిని ఇన్‌‌స్పిరేషన్‌‌గా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలుపెట్టినప్పుడు మాకు రవితేజ గారు ఇన్‌‌స్పిరేషన్. ఆయన మాటల్లో ఎంతో ప్రేమ ఉంటుంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’కి పాజిటివ్ వైబ్ ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న కాంబినేషన్ అనిపిస్తోంది’ అన్నాడు.  రవితేజ మాట్లాడుతూ ‘చాలా డిఫరెంట్ మూవీ. శరత్ మంచి సబ్జెక్ట్‌‌తో వచ్చాడు. నిర్మాత సుధాకర్ కూల్, పాజిటివ్ పర్సన్. ఆయనతో ఎన్ని సినిమాలైనా చేయడానికి నేను రెడీ. దివ్యాంశ, రాజీషాలతో పాటు అన్వేషి జైన్ పాట కూడా అలరిస్తుంది. వేణు తొట్టెంపూడితో కలిసి ‘స్వయంవరం’ చేయాలి. కానీ మిస్ అయ్యింది. ఇన్నాళ్లకి కలిసి నటించడం హ్యాపీ’ అన్నాడు.  ‘ఈ సినిమా చాలా యునిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇస్తుంది. టికెట్స్ సాధారణ ధరలకే అందుబాటులో ఉంటాయి’ అని చెప్పాడు శరత్. రవితేజతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్ అన్నారు హీరోయిన్స్. వేణు తొట్టెంపూడి, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, డీవోపీ సత్యన్ సూర్యన్, ఎడిటర్ ప్రవీణ్ కేఎల్​ పాల్గొన్నారు.