హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, సీనియర్ నేతలు జానా రెడ్డి, మధుయాష్కి గౌడ్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, నాయకులు ఫిరోజ్ ఖాన్, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్, అక్బర్, తదితరులు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఇచ్చిన ఆతిథ్యాన్ని నాయకులు స్వీకరించారు. తర్వాత అందరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, దానం నాగేందర్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, నాయకులు వేర్వేరు సమయాల్లో హాజరయ్యారు.
