ట్యాబ్లెట్ల అక్రమ నిల్వ.. మెడికల్ షాపులో ట్రామాడాల్ క్యాప్సుల్స్ స్వాధీనం

ట్యాబ్లెట్ల అక్రమ నిల్వ.. మెడికల్ షాపులో ట్రామాడాల్ క్యాప్సుల్స్ స్వాధీనం

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌‌‌‌ జీహెచ్‌‌‌‌ఎంసీ డివిజన్‌‌‌‌ పరిధిలోని మెడికల్‌‌‌‌ షాపులపై తెలంగాణ సేఫ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ విభాగం అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.

శ్రీగణేశ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ స్టోర్‌‌‌‌లో అక్రమంగా నిల్వ ఉంచిన ట్రామాడాల్‌‌‌‌ క్యాప్సుల్స్‌‌‌‌, పీవాన్‌‌‌‌ స్పాస్‌‌‌‌ ట్యాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకుండానే ట్రామాడాల్‌‌‌‌ క్యాప్సుల్స్‌‌‌‌ను కొని నిల్వ చేయడంతోపాటు, బిల్లులు ఇవ్వకుండానే వాటిని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం 6,368 ట్రామాడాల్‌‌‌‌ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.58,904 ఉంటుందని అధికారులు తెలిపారు.