
గోదావరిఖని, వెలుగు: సమాజాభివృద్ధితో పాటు నేరాల నియంత్రణలో యువత భాగస్వాములు కావాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా పిలుపునిచ్చారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
శిబిరంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ రమేశ్, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్లప్ప, ట్రెజరర్ రాజేంద్ర కుమార్, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రీజియన్ చైర్మన్ రాజేందర్, సీఐలు ఇంద్రసేనారెడ్డి , ప్రవీణ్ కుమార్, రవీందర్, ఎస్ఐలు రమేశ్, సంధ్యారాణి పాల్గొన్నారు.