గోదావరిఖని, వెలుగు: కోల్ బెల్ట్ఏరియాలోని ఆలయాలకు కొత్త రూపు తీసుకువస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. గోదావరిఖని కోదండ రామాలయం ఆవరణలో శుక్రవారం సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. మేయర్ మహంకాళి స్వామితో కలిసి సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాలయం ఆవరణలో రూ.2 కోట్లతో కల్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రామగుండం టర్నింగ్ సమీపంలో హనుమాన్ జంక్షన్ వద్ద భారీ ఆంజనేయస్వామి విగ్రహం, మున్సిపల్ ఆఫీస్ సమీపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి జీఎం డి.లలిత్‌కుమార్, జాతీయ ఎస్సీ కమిషన్మెంబర్ వడ్డేపల్లి రాంచందర్, ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
