రామగుండం GHMC బడ్జెట్​ రూ.211కోట్లు

రామగుండం GHMC  బడ్జెట్​ రూ.211కోట్లు

గోదావరిఖని, వెలుగు: రామగుండం మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ కౌన్సిల్​ సమావేశం గురువారం జరిగింది.  2024–-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.211 కోట్ల 22 లక్షల 27 వేల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంచనా వ్యయం రూ.196 కోట్ల 42 లక్షల 41 వేల కాగా మిగులు రూ.14 కోట్ల 79 లక్షల 86 వేలుగా ప్రతిపాదించారు.

 ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ మాట్లాడుతూ రామగుండంను మహానగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం సిటీలో కొంతకాలంగా పరిశ్రమలు మూతపడగా ఉద్యోగాలు దొరక్క జనాభా తగ్గుతోందన్నారు. లక్ష్మీనగర్​ను వాణిజ్య ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​లో కమిషనర్ శ్రీకాంత్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.