చోటా లీడర్.. బడా డ్రీమ్

చోటా లీడర్.. బడా డ్రీమ్

పెళ్లిచూపులు, జార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి లాంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ బేతిగంటి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఇదొక పొలిటికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్ మూవీ.  ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రజినీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. నాయకుల కోసం జెండాలు ఎత్తిన వారు ఏమవుతారు అనే మంచి పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమా తీస్తున్న నవీన్.. స్టోరీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సక్సెస్ అయ్యాడు.  

మనం చూసిన ఒక ఊరి కథ ఇది. నవీన్ తరహాలో కొత్త కొత్త ఆలోచనలతో యంగ్ టాలెంట్ ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది’ అన్నారు. నవీన్ మాట్లాడుతూ ‘ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ ఈ సినిమా చేయలేదు. రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే ఒక యువకుడి కథ. ఇందులో  హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. ఆరు ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుంటుంది’ అని చెప్పాడు. నటులు అమూల్య రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, అనిల్ గీల తదితరులు పాల్గొన్నారు.