వెంకటాపూర్(రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.7,92,128 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ తెలిపారు. నోట్ల రూపంలో రూ.6,89,040, నాణేల రూపంలో రూ.1,03,127 వచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర స్వామి ఆలయ ఈవో వెంకటయ్య, అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్, పాలంపేట సర్పంచ్ చల్ల కొండరాజు, కార్యదర్శి రేవతి, ఆర్‌ఐ రమేశ్, పోలీసు సిబ్బంది, శ్రీవల్లి సేవ సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
